ఇండస్ ఇండ్‌లో నిప్పాన్‌కు వాటా?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో వాటా తీసుకునే అంశాన్ని జపాన్‌కు చెందిన బీమా సంస్థ నిప్పాన్ లైఫ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలో ఆ కంపెనీకి ఉన్న సంస్థ రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ వాటా కొనాలని జపాన్ కంపెనీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంక్‌లో 9.9 శాతం వాటా కొనాలని భావిస్తోంది. అయితే తొలుత 4.9 శాతం వాటాను కొని… తరవాత వాటాను పెంచుకునే యోచన బ్యాంక్‌కు ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ ఇండ్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 73,000 కోట్లు ఉంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి నిప్పాన్ లైఫ్ నిరాకరించింది.