For Money

Business News

దుమ్మురేపిన నిఫ్టి

స్వాతంత్ర్యదినోత్సవం రోజు ప్రధాని మోడీ చేసిన జీఎస్టీ ప్రకటన మార్కెట్‌లో కొత్త జోష్‌ నింపింది. ఆరంభంలోనే దాదాపు అన్ని రంగాల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఆరంభంలోనే 24950రి తాకింది. నిఫ్టి 300 పాయింట్లకుపైగా లాభపడగా, సెన్సెక్స్‌ కూడా 1000 పాయింట్లు లాభపడింది. ఐటీ, ఫార్మా కౌంటర్లు నికలడగా ఉండగా, మిగిలిన అన్ని రంగాల షేర్లు మంచి ఊపు మీద ఉన్నాయి. ముఖ్యంగా ఆటో రంగం సూచీ మూడు శాతంపైగా లాభపడింది. ప్యాసింజర్‌, చిన్న కార్లపై జీఎస్టీ ఏకంగా 28 శాతం నుంచి 18శాతానికి తగ్గుతుందన్న వార్తలతో ఈ రంగానికి చెందిన షేర్లకు గట్టి మద్దతు లభించింది. హీరో మోటోకార్ప్‌, మారుతీ ఏడు శాతం దాకా లాభపడగా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నాలుగు శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక నెస్లే కూడా 4 శాతంపైగా లాభపడింది. ఇక నిఫ్టిలో ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 0.58 శాతం నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది. సిగరెట్లపై జీఎస్టీ పెంచుతారనే అంచనాతో ఐటీసీ షేర్‌ నిలకడగా ట్రేడవుతోంది.

Leave a Reply