భారీ షార్ట్ కవరింగ్
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తన సేనలను వెనక్కి తీసుకుంటున్నట్ల రష్యా ప్రకటించడంతో షేర్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. యూరో మార్కెట్ల ప్రారంభానికి మన మార్కెట్లు ఒక మోస్తరు లాభాల్లోకి వచ్చింది. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉండేసరికి… నిఫ్టి కూడా 300 పాయింట్ల లాభంతో ట్రేడైంది. అయితే రష్యా నుంచి ప్రకటన వచ్చిన వెంటనే భారీ షార్ట్ కవరింగ్ రావడంతో నిఫ్టి ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 509 పాయింట్ల లాభంతో 17352 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 3 శాతం లాభపడగా, ఇతర సూచీలన్నీ మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. మిడ్ క్యాప్ నిఫ్టి 3.73 శాతం లాభంతో క్లోజైంది. దాదాపు ఏడు శాతం లాభంతో నిఫ్టిలో టాటా మోటార్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.