For Money

Business News

ఓపెనింగ్‌లో నిఫ్టిపై ఒత్తిడి

ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టి ప్రారంభంలోనే 16655 వద్ద ఒత్తిడి ఎదుర్కొంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 16,577 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్‌ షేర్ల సూచీ కూడా గ్రీన్‌లో నుంచి రెడ్‌లోకి వచ్చింది. అలాగే బ్యాంక్, ఫైనాన్షియల్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టి అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టికి 16,566 వద్ద మద్దతు లభించింది. 16,540 వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురు కావొచ్చు. నిఫ్టి లాభాల్లోకి రావాలంటే 16,600 స్థాయిని దాటాల్సి ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 432.70 2.03
యూపీఎల్‌ 731.70 1.67
ఎల్‌ అండ్‌ టీ 1,609.95 0.89
డాక్టర్‌ 4,534.30 0.68
టాటా స్టీల్‌ 1,383.55 0.62

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 690.50 -1.19 టెక్ మహీంద్రా 1,433.65 -1.09
హెచ్‌డీఎఫ్‌సీ 2,671.05 -1.09
ఎం అండ్‌ ఎం 773.50 -1.01
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 991.55 -0.99