For Money

Business News

నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి

ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి నిఫ్టి జారుకుంది. మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లోనే కొనసాగింది. సరిగ్గా ఒంటి గంటకు గ్రీన్‌లో వచ్చిన నిఫ్టి 18095 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దిగువ స్థాయి నుంచి దాదాపు వంద పాయింట్ల వరకు లాభపడి… ఇపుడు 18,071 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ భారీ నష్టాలను పూడ్చుకుని నామ మాత్రపు నష్టాల్లో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తో పాటు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నిఫ్టి సూచీలో టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌తో పాటు ఆటో మొబైల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇవాళ మిడ్‌క్యాప్‌ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీ 1.25 శాతం లాభంతో ఉంది.