17100 దగ్గర్లో నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17095ని తాకిన నిఫ్టి ఇపుడు 17074 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 115 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో 39 షేర్లు లాభాల్లో ఉండగా, 10 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా నామమాత్రపు లాభాల్లో ఉంది. నిఫ్టి, నిఫ్టి నిక్ట్స్, నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీలు అరశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఆటో కంపెనీలు ఇవాళ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లు స్వల్పంగా ఉన్నాయి. నిన్న భారీ లాభాలతో ట్రేడైన అపోలో హాస్పిటల్ ఇవాళ స్వల్ప నష్టంతో ఉంది.