లాభాల్లో మొదలు…
గిఫ్ట్ నిఫ్టికి భిన్నంగా లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో 24426 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టితో పాటు మిడ్ క్యాప్ సూచీలో ఒత్తిడి కన్పిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు డల్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవాళ పది శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఉంది. ఈ షేర్ లోయర్ సర్క్యూట్‌లో ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో పది శాతం లోయర్ సర్క్యూట్ వద్ద అమ్మకానికి దాదాపు 24 లక్షల షేర్లు ఉన్నాయి. ఏకంగా ఎన్‌టీపీసీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ ఫైవ్ లూజర్స్‌లో ఉన్నాయి.