For Money

Business News

స్థిరంగా స్టాక్‌ మార్కెట్లు

ఇవాళ మిడ్‌ సెషన్‌ సమయానికే తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది నిఫ్టి. ఉదయం ఆరంభంలోనే లాభాల్లో నుంచి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ లాభాల్లోకి వచ్చి 15,977ని తాకిన నిఫ్టి.. అదే స్థాయిలో నిలబడలేకపోయింది. యూరో మార్కెట్‌ ఇవాళ కూడ ఆ నష్టాలతో ప్రారంభం కావడంతో నిఫ్టి క్షీణించింది.ప్రస్తుతం 15823 పాయింట్ల వద్ద 41 పాయింట్ల లాభంతో ట్రడేవుతోంది. బ్యాంక్‌, నిఫ్టి నెక్ట్స్‌షేర్లు పటిష్ఠంగానే ఉన్నాయి. అయితే మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. పిఫ్టి సిమెంట్‌ షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి.చక్కటి ఫలితాలు ప్రకటించిన ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉంది. అయితే యూరో మార్కెట్లు స్వల్ప నష్ట్లాల్లో ఉన్నాయి. మరి చివర్లో కోలుకుంటాయా లేదా నస్టాలతో ముగిస్తాయా అన్నది చూడాలి.