భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం
సరిగ్గా సింగపూర్ నిఫ్టి స్థాయి లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం 18,191 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.9 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ ఇవాళ 5 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా ఉంది. నిఫ్టి ప్రస్తుత స్థాయిలో కన్నా…పడినపుడు కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని సలహా ఇస్తున్నారు. నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లు 0.3 శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి అన్నింటికన్నా అధికంగా 0.9 శాతం లాభంతో ట్రేడవుతోంది.