NIFTY LEVELS: ఛాన్స్ దొరికేనా?https://formoney.in/wp-admin/post-new.php
నిఫ్టి చాలా కీలకమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నా.. ఫ్యూచర్స్‌పై పెడుతున్నారు. అదే సమయంలో ఆప్షన్స్‌లోఅమ్ముతున్నారు. అయితే 17500 కాల్, పుట్ రేషియా దాదాపు సమానంగా ఉండటంతో మార్కెట్‌లో అనిశ్చితికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ భారీ పెరగడం లేదా తగ్గడం అనుమానమే. అటుఇటూ కదలాడొచ్చు. ఇలాంటి సమయంలో నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని అంటున్నారు సీఎన్‌బీసీ ఆవాజ్ డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్. నిఫ్టికి 17461 లేదా 17409 వద్ద కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆయన అంటున్నారు. కచ్చిత స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.నిఫ్టి క్రితం ముగింపు 17563. నిఫ్టికి 17500 ప్రాంతంలోనే మద్దతు అందుతుందని మరికొందరు అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టి తరవాత సోమవారం మూరత్ ట్రేడింగ్ ఉంటుంది. మంగళవారం మార్కెట్ ఉంటుంది కాని.. బుధవారం సెలవు. కాబట్టి గురువారం అక్టోబర్ నెల డెరివేటివ్స్, వీక్లీ కాంట్రాక్ట్‌ల క్లోజింగ్. అంటే పూర్తి స్థాయి ట్రేడింగ్ కేవలం రెండు రోజులే. ఇవాళ, మంగళవారం. గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్‌కు బ్రోకర్ల ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా డే ట్రేడింగ్ చేసేవారు, ఆప్షన్స్‌లో చేసేవారు పొజిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే కాంట్రాక్ట్‌లో టైమ్ వ్యాల్యూ బాగా తక్కువ కాబట్టి.. పతనం లేదా పెరగడం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. లేదంటే వచ్చే నెల కాంట్రాక్ట్‌లో పొజిషన్స్ తీసుకోండి.