17400 దగ్గరగా నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17382ను తాకింది. ఇపుడు 17370 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సిప్లా ఇవాళ టాప్ గెయినర్‌గా ఉండటం విశేషం. కొటక్ బ్యాంక్ ఒకశాతం నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచింది. ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ కారణంగా అరబిందో ఫార్మా ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కాస్త గ్రీన్‌లో ఉన్నా.. ఇతర ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో బంధన్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్‌లో టాటా పవర్ టాప్ గెయినర్‌గా ఉంది. అయితే లాభాలు ఒకశాతం లోపే ఉన్నాయి. నిఫ్టిలో పెద్ద కదలికలు లేకున్నా 32 షేర్లు గ్రీన్‌లో ఉండగా, 18 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. జొమాటో షేర్ రూ. 1.10 నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ ఈ కౌంటర్లో భారీ బ్లాక్ డీల్ ఉంటుందని భావిస్తున్నారు. ఊబర్ ఈ కంపెనీ నుంచి వైదొలగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పే టీఎం కూడా రూ.9 తగ్గింది.