నికలడగా ఉన్నా… లాభాలేవి?
ఉదయం నష్టాల్లో జారుకున్న నిఫ్టి ఇపుడు లాభాల్లో కొనసాగుతోంది. కాని నామ మాత్రపు లాభాలతో ఉంది. ఉదయం 16243ని తాకిన నిఫ్టి మిడ్ సెషన్‌లో 16404ని తాకింది. ఇపుడు 29 పాయింట్ల లాభంతో 16331 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ మినహా మిగిలిన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవల కాస్త ఒత్తిడికి లోనైనా ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఇవాళ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మెటల్స్ వీక్‌గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. చాలా వరకు సూచీలు దాదాపు రెండు శాతం దాకా లాభంతో ఉన్నాయి. యూరోస్టాక్స్ 50 సూచీ 1.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. మరి నిఫ్టి క్లోజింగ్‌లో కోలుకుంటుందేమో చూడాలి.