For Money

Business News

లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ఒక మోస్తరు లాభాలో ప్రారంభమైంది. ఆరంభంలోనే 17,723 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17665 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 26 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 59,092 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి ఫైనాన్షియల్స్‌ స్వల్ప నష్టాల్లో ఉండగా, నిఫ్టి మిడ్‌క్యాప్‌ అరశాతం లాభంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ 0.84 శాతం లాభంతో ఉంది. కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్‌గా ఉండగా, సిప్లా టాప్‌ లూజర్‌గా ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లో చోళా ఫైనాన్స్‌ ఏకంగా ఆరు శాతం లాభంతో ఉండటం విశేషం.