స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఉదయం17291ని తాకిన నిఫ్టి వెంటనే 17091ని తాకినా.. వెంటనే కోలుకుని 17222 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 23 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించాయి. బ్యాంక్ నిఫ్టి ఇవాళ కూడా ఏకంగా 1.72 శాతం క్షీణించింది. కేవలం బ్యాంక్ షేర్ల కారణంగా నిఫ్టి రెడ్లో ఉంది. ముఖ్యంగా నిఫ్టి అధిక వెయిటేజి ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ గత కొన్ని రోజులుగా భారీగా క్షీణిస్తూ వచ్చింది. ఇవాళ నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై ఏమాత్రం చూపడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎఫ్ఎంసీజీ షేర్లపై అధిక ఒత్తిడి కన్పిస్తోంది.