స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
స్వల్ప నష్టాల తరవాత నిఫ్టి ఇపుడు గ్రీన్లో ట్రేడవుతోంది. 17,521 సాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 58676 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం భారీగా నష్టపోయిన మిడ్ క్యాప్ సూచీ ఇవాళ అర శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. గతవారం ఆకరర్షణీయ లాభాలను ప్రకటించిన ఎస్బీఐ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. బ్యాంక్ ఫలితాలను మార్కెట్ డిస్కౌంట్ చేసినట్లు కన్పిస్తోంది. ఈ స్థాయి వద్ద చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. పేటీఎం ఇవాళ కూడా నష్టాలతో ట్రేడవుతోంది. కంపెనీ నష్టాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. జీఎన్ఎఫ్సీ షేర్ పది శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక నష్టాల విషయానికొస్తే లుపిన్ , బిర్లా కార్పొరేషన్, దీపక్ ఫర్టిలైజర్స్ 4 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. డీబీ రియాల్టితో డీల్ క్యాన్సిల్ చేయడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్ 7 శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది. డీబీ రియాల్టి 5 శాతం నష్టపోయింది.