నిలకడగా నిఫ్టి
ఉదయం నుంచి నిఫ్టి నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. లాభాల్లో లేకున్నా… నష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. నెగిటివ్ వార్తలు లేనందున.. ఏక్షణమైనా లాభాల్లో వచ్చే అవకాశముంది. మార్కెట్ ఇవాళ పెద్దగా పడనందున… ఎవరూ ఈ స్థాయిలో కొనవద్దని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే పొజిషన్స్ తీసుకున్నవారు కొనసాగించవచ్చని అంటున్నారు. నిఫ్టి ప్రస్తుతం19 పాయింట్ల నష్టంతో 17558 పాయింట్ల వద్ద ఉంది. బ్యాంక్ నిఫ్టి మాత్రం గ్రీన్లో ఉంది. అపోలో హాస్పిటల్స్ ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్ కాగా, దివీస్ ల్యాబ్ ఇవాళ నిఫ్టి టాప్ లూజర్. అదానీ గ్రీన్ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. ఈ కంపెనీకి ప్రతికూలంగా ఫిచ్ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ 4 శాతంపైగా పెరిగింది. అలాగే ఆస్ట్రాల్లో మద్దతు కొనసాగుతోంది. బ్యాంక్ షేర్లలో ఎస్బీఐ ఒక్కటే ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ముఖ్యంగా మిడ్ క్యాప్ బ్యాంకులకు మంచి మద్దతు లభిస్తోంది. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటంతో… రోలోవర్స్పై కన్నేయండి.