For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యాయి. ఒక మోస్తరు నష్టాలతో మొదలైన నిఫ్టి వెంటనే భారీగా నష్టపోయినా వెంటనే కోలుకుంది. ఉదయం 24823 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 24753 పాయింట్లకు క్షీణించింది. వెంటనే కోలుకుని 24831 పాయింట్ల వద్ద 21 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఇవాళ నిఫ్టికి మద్దతు లభిస్తోంది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలు కూడా స్థిరంగా ఉండటం విశేషం. మిడ్‌ క్యాస్‌తో పాటు స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఎస్‌బీఐ లైఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, శ్రీరామ్‌ ఫైనాన్స్; హిందుస్థాన్‌ లీవర్‌ ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ ఉన్నాయి.

Leave a Reply