MID SESSION:17600 దిగువకు నిఫ్టి
ఉదయం స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టిలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా అనేక మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. దీంతో ఇటీవల బాగా పెరిగిన షేర్ల ధరలు క్షీణిస్తున్నాయి. దీనికి తోడు నిరుత్సాహకర పనితీరు కనబర్చిన కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం 17781 స్థాయిని తాకిన నిఫ్టి కాస్సేపటి క్రితం 17584 పాయింట్లకు చేరింది. అంటే దాదాపు 200 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 189 పాయింట్ల నష్టంతో 17,591 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే ఇతర సూచీలన్నీ కేవలం అర శాతం, అంతకన్నా తక్కువ నష్టాలతో ఉన్నాయి. కేవలం నిఫ్టి మాత్రమే ఒక శాతంపైగా నష్టపోయింది. దీనికి కారణం… ట్రేడింగ్ అధికంగా నిఫ్టి ఆధారంగా సాగడం. ముఖ్యంగా రియాల్టి షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది.