18150 దిశగా నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18142ను తాకిన నిఫ్టి ఇపుడు 18138 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 111 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 40 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. గత వారాంతాన వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. నాస్డాక్ 2 శాతం పైగా లాభపడింది. ఇవాళ కూడా ఇతర కీల్ సూచీల కంటే బ్యాంక్ నిఫ్టి చాలా పటిష్టంగా ఉంది. సూచీలోని అన్ని షేర్లు గ్రీన్‌లో ఉండటంతో బ్యాంక్ నిఫ్టి ఒక శాతం లాభపడింది. నిఫ్టిలో హీరో, పవర్‌గ్రిడ్, యూపీఎల్, హిందాల్కో, టాటా మోటార్స్ షేర్లు ఒకటిన్నర శాతం పైగా లాభపడింది. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో అల్ట్రాటెక్, ఎన్టీపీసీ, JSW స్టీల్ ముందున్నాయి. ఫలితాలు బాగుండటంతో బంధన్ బ్యాంక్ 5 శాతంపైగా పెరిగింది. ఏయూ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు కూడా దాదాపు రెండు శాతం దాకా లాభపడ్డాయి.