17600 పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్లోఏఏ 17643ని తాకిన నిఫ్టి ఇపుడు 17632 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 69 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి స్వల్ప లాభాలతో ఉన్నా… నిఫ్టిలో 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎన్టీపీసీ రెండున్నర శాతం లాభంతో ఉంది. మిగిలిన షేర్లు స్వల్ప లాభాలతో ఉన్నాయి. నిఫ్టి లూజర్స్‌లో మారుతీ టాప్‌లో ఉంది. ఇతర ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ సూచీలు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఎన్డీటీవీ షేర్ ఇవాళ కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్లో ఉంది. షేర్ రూ. 519కి చేరింది. ఈ ధర వద్ద 3 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు ఎన్ఎస్ఈలో. దీంతో ఇతర మీడియా షేర్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది.