నిఫ్టి… ఓపెనింగ్‌లోనే ఒత్తిడి
ఓపెనింగ్‌లోనే షార్ట్ సెల్లర్స్‌కు మంచి అవకాశం దక్కింది. కేవలం నిమిషాల్లో 50 పాయింట్ల లాభం దక్కింది. ఓపెనింగ్‌లోనే 17,379ని తాకిన నిఫ్టి వెంటనే 17,332ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 114 పాయింట్ల లాభంతో 17,335 పాయింట్ల వద్ద ఇపుడు ట్రేడవుతోంది. నిఫ్టికి ఇక్కడ మద్దతు అందుతుందేమో చూడాలి. లేకుంటా 17,300 దిగువకు వెళుతుందేమో వెయిట్ చేయండి. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి.కాని అంతర్లీనంగా ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి 0.66 శాతం లాభపడగా, చురగ్గా ఉండే మిడ్ క్యాప్ నిఫ్టి ఇంకా 0.5 శాతం మాత్రమే లాభపడింది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ మార్కెట్‌కు అండగా ఉంది. ఊహించినట్లే ఐటీ షేర్లకు మద్దతు లభించింది. డాలర్ బలపడటం, రాత్రి నాస్డాక్ భారీగా పెరగడంతో… ఈ సెక్టార్‌కు కలిసి వచ్చింది. ఇండియా బుల్స్ హౌసింగ్‌లో ప్రమోటర్ సమీర్ గెహ్లాట్ తనవాటాలో 11.9 శాతం వాటానే అమ్మేశారు. ఈ కంపెనీ షేర్ స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్.