For Money

Business News

MID SESSION: నిలకడగా నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లన్నీ దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.97 శాతం లాభంతో ఉంది. ఉదయం ఆసియా మార్కెట్లు నిరాశాజనకంగా ముగిశాయి. జపాన్‌, హాంగ్‌సెంగ్‌ సూచీల్లో బలం లేదు. ఇక చైనా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. యూరో మార్కెట్లు గ్రీన్‌ ఉన్నందున మన మార్కెట్లు ఇంకా గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం 17181ని తాకిన నిఫ్టి ఇపుడు 17117 వద్ద 163 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి అంత్యంత కీలక స్థాయిలో ఉంది. నిఫ్టి గనుకు 17105ని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి అధికం కావొచ్చు. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌లో ఉన్నాయి. ఎల్లుండి వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టి చివరి వరకు ఇదే లాభాలను కొనసాగిస్తుందా లేదా కోల్పోతుందా అన్నది చూడాలి.