For Money

Business News

నిలకడగా నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా… ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా నిలకడగా ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 17032ను తాకిన నిఫ్టి తరవాత 16976కు పడింది. ఇవాళ వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టిలో హెచ్చు తగ్గులకు ఛాన్స్‌ ఉంది. రేపు శ్రీరామనవమి సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. దీంతో డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఇవాళ చేస్తున్నారు. నిఫ్టి ప్రస్తుతం 63 పాయింట్ల లాభంతో 17014 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 42 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిన్న భారీగా నష్టపోయిన అదానీ షేర్లు ఇవాళ స్వల్పంగా కోలుకున్నాయి. అదానీ పోర్ట్స్‌ 4 శాతం, అదానీ ఎంటర్‌ ప్రైజస్‌ 3.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. అదానీ గ్రీన్‌ స్వల్ప లాభంలో ఉండగా, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్‌ మాత్రం నష్టాల్లో ఉన్నాయి.