For Money

Business News

17000 దిగువన ముగిసిన నిఫ్టి

ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి కోలుకోవడానికి నిఫ్టి ప్రయత్నించినా… 17000 దిగువన ముగిసింది. ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో ఓ సారి లాభాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. కాని తరవాత మరింత ఒత్తిడితో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16913ని తాకింది. క్లోజింగ్‌కు ముందు స్వల్పంగా కోలుకున్నా 16951 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి స్వల్ప లాభాలత్ఓ క్లోజ్‌ కాగా, మిగిలిన ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టి నెక్ట్స్‌ దాదాపు ఒక శాతం నష్టంతో ముగిసింది. అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల హోరు కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌7 వాతం అదానీ పోర్ట్స్‌ అయిదు శాతం నష్టంతో ముగిశాయి. అదానీ టోటల్‌, అదానీ గ్రీన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏసీసీ అయిదు శాతం నష్టంతో ముగిశాయి. అంబుజా సిమెంట్‌ కూడా . శాతం నష్టంతో క్లోజైంది.