For Money

Business News

నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలపడ్డాయి. ఆరంభంలో 17061 పాయింట్ల స్థాయినా… అరగంటలోనే నిఫ్ఠి నష్టాల్లోకి జారుకుంది. 17000పైన నిఫ్టికి గట్టి ప్రతిఘటన ఎదురు అవుతోంది. ప్రస్తుతం 16930 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా క్షీణించాయి. ఇవాళ కూడా ఈ కౌంటర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్‌ ఏకంగా ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంకు షేర్లలోనూ ఒత్తిడి ఉంది.అదానీ షేర్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బ తీస్తున్నాయి. దాదాపు అన్ని అదానీ కౌంటర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంబుజా సిమెంట్‌, ఏసీసీ కంపెనీల రుణాలను అదానీలు షెడ్యూల్‌ ప్రకారం చెల్లించే పరిస్థితి లేదని… వాయిదా కోరవచ్చని వార్తలు రావడం, అలాగే విపక్షాలు అదానీపై విచారణకు ఒత్తిడి తేవడంతో ఆ కౌంటర్లలో ఒత్తిడి వస్తోంది.