For Money

Business News

పటిష్ఠంగా ముగిసిన నిఫ్టి

వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ సమయంలో లాభాలన్నీ కోల్పోయింది. నష్టాల్లోకి జారుకుని 16940ని తాకింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటం, మిడ్‌ సెషన్‌లో కూడా యూరో మార్కెట్లు ఒక్క శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతం దాకా లాభాల్లోకి రావడంతో నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకుంది. ఒకదశలో 17126ని తాకిన నిఫ్టి.. క్లోజింగ్‌లో 17080 వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న మిడ్‌ క్యాప్‌ సూచీ ఇవాళ రెండు శాతం దాకా లాభ పడటం విశేషం. ఇతర ప్రధాన సూచీలన్నీ 0.8 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 9 శాతంపైగా లాభపడి రూ. 1749 వద్ద ముగిసింది. అలాగే అదానీ పోర్ట్స్‌ కూడా 7 శాతంపైగా లాభపడింది. అయితే నిఫ్టి గ్రీన్‌, నిఫ్టి టోటల్‌ నష్టాల్లో క్లోజ్‌ కాగా అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ 5 శాతం లాభంతో అప్పర్‌ సీలింగ్‌ వద్ద ముగిశాయి.