17000పైన నిఫ్టి.. కానీ
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే స్వల్ప లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17036ని తాకింది. ఇపుడు 33 పాయింట్ల లాభంతో 17016 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నాయి. లాభనష్టాలు ఉన్నా… చాలా తక్కువ. నిఫ్టి బ్యాంక్‌లో మాత్రం స్వల్ప నష్టంతో ఉంది. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న హెచ్‌సీఎల్ టెక్ ఇపుడు నిఫ్టి టాప్ గెయినర్‌గా ఉంది. ఇవాళ విప్రో ఫలితాలు కూడా రానున్నాయి. అయితే హిందాల్కో, మారుతీ, టాటా స్టీల్ వంటి షేర్లు బలహీనంగా ఉండటంతో నిఫ్టి ముందుకు సాగడం లేదు. ఓపెనింగ్ అడ్జస్ట్మెంట్ తరవాత నిఫ్టి ఎలా కదలుతుందో చూడాలి. అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్ ఇవాళ కూడా రెడ్‌లో ఉన్నాయి. ఏయూ బ్యాంక్‌లో ఒత్తిడి కన్పిస్తోంది. ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి పెరిగితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఐటీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. నిఫ్టి బ్యాంక్‌కు భిన్నంగా నిఫ్టి ఐటీ పనిచేస్తోంది. స్పెషాలిటీ కెమికల్స్ షేర్లకు మాత్రం డిమాండ్ కన్పిస్తోంది. అనలిస్టులు కూడా దీపక్ నైట్రేట్‌ను కొనుగోలు చేయాలని డే ట్రేడింగ్‌కు సిఫారసు చేస్తున్నారు. మరికొందరు అనలిస్టులు సిటీ యూనియన్ బ్యాంక్ ను రూ.175 స్టాప్‌లాస్‌తో రూ.186 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మంచి ఫలితాలు ప్రకటించినా డెల్టా కార్ప్ లాభాల నుంచి నష్టాల్లోకి వచ్చేసింది.