16,650పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. 16,673ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16,669 పాయింట్ల వద్ద 45 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్లో ఉన్నాయి. ఇవాళ కూడా బజాజ్ ఫిన్ సర్వ్ 2 శాతం దాకా లాభంతోఉంది. బజాజ్ ఫైనాన్స్ కూడా గ్రీన్లో ఉంది. ప్రభుత్వం మానిటైజేషన్ ప్రకటించిన తరవాత అదానీ గ్రూప్ షేర్లు రోజూ పెరుగుతున్నాయి. ఇవాళ కూడా పలు షేర్లు 5 శాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో 40 షేర్లు లాభాలు ఉన్నాయి. నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. నిఫ్టి మళ్ళీ 16,670ని దాటితే 20 పాయింట్ల స్టాప్లాస్తో అమ్మొచ్చు.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ 16,777.25 1.92
టాటా మోటార్స్ 285.15 1.91
హిందాల్కో 428.15 1.73
బజాజ్ ఫైనాన్స్ 7,048.50 0.98
నెస్లే ఇండియా 19,931.55 0.77
నిఫ్టి టాప్ లూజర్స్
టెక్ మహీంద్రా 1,453.00 -0.71
ఏషియన్ పెయింట్స్ 3,031.00 -0.49
భారతీ ఎయిర్టెల్ 617.60 -0.40
హిందుస్థాన్ లీవర్ 2,625.50 -0.28