15700 పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైనా… వెంటనే కోలుకుంది. ఓపెనింగ్‌లో 15,674 ని తాకిన నిఫ్టి ఇపుడు 15739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు నిఫ్టి బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన నిఫ్టి మిడ్ క్యాప్ అరశాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్ స్వల్ప లాభంతో ఉంది. నిఫ్టిలో 29 షేర్లు లాభాల్లో ఉండగా, 21 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సూచీ ప్రధాన షేర్లలో కాస్త గ్రీన్ కన్పిస్తున్నా… ఇతర షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. అలాగే క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉండటంతో ఏషియన్ పెయింట్స్‌లో ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. టీసీఎస్ రూ. 3200 దిగువకు వచ్చింది. హెచ్డీఎఫ్సీ ట్విన్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఎల్ఐసీ షేర్ రూ.10 పెరిగి రూ. 677 వద్ద ట్రేడవుతోంది.