For Money

Business News

NIFTY TRADE: 16921 కీలక స్థాయి

మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఈ అమ్మకాలను దేశీ ఇన్వెస్ట్ల తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2070 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1478 కోట్ల కొనుగోలు చేశారు. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలోఎఫ్‌ఐఐల అమ్మకాలు రూ. 6,236 కోట్లు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ. 471 కోట్లు అమ్మగా, ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో రూ. 5,264 కోట్లు అమ్మారు. నిఫ్టికి దిగువ స్థాయిలో రూ.16,921లో లేదా 16,857 వద్ద మద్దతు లభించవచ్చు. నిఫ్టి గనుక పెరిగితే 17063 వద్ద అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి ఎక్కడ పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=FS7jPneEt-w