24,000ను తాకిన నిఫ్టి

బ్యాంక్ షేర్లు మార్కెట్‌కు జోష్ ఇస్తున్నాయి. ఇవాళ దాదాపు అన్ని సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. 24,004 స్థాయిని తాకిన తరవాత నిఫ్టి ప్రస్తుతం 23943 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 79 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి 830 పాయింట్ల లాభఃతో 55120 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో అదానీ పోర్ట్స్ టాప్‌లో ఉంది. ఎటర్నల్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, టైటాన్ తరువాతిస్థానాల్లో ఉన్నాయి. ఇవాళ 2414 షేర్లు ట్రేడవుతుండగా, 1420 షేర్లు లాభాల్లో ఉండగా, 908 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 67 షేర్లు ఇపుడు అప్పర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. కేవలం 23 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ట్రేడవుతున్నాయి.