NIFTY TRADE: డబుల్ ఛాన్స్ ఉంటుందా?
చైనా మార్కెట్లు ముఖ్యంగా హాంగ్‌కాంగ్ మార్కెట్ల పతనం మన మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కాబట్టి నిఫ్టి ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించండి. నిఫ్టి క్రితం ముగింపు 16,354. నిఫ్టి ఇవాళ్టి రేంజ్ 16,311 నుంచి 16,405. చైనా మార్కెట్ల ప్రభావం ప్రతికూలంగా ఉంటే నిఫ్టి 16,250 ప్రాంతానికి వెళ్ళే అవకాశముంది. అలాగే మన మార్కెట్లకు పాజిటివ్ అయితే 16,415ని దాటే అవకాశముంది. నిఫ్టి భారీ లాభాలు రావాలంటే 16,430ని దాటాలి. వారాంతాన ఈ స్థాయి మద్దతు అనుమానమే. అలాగే స్వల్పకాలిక టెక్నికల్స్ సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. కాబట్టి మార్కెట్ 16410ని దాటితే అమ్మడానికి అవకాశంగా భావించండి. నిఫ్టి పడితే 16310 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. 15-20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో ఇరువైపులా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.