నిఫ్టికి తక్షణ సపోర్ట్ పోయినట్లే…
స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ చాలా స్పష్టంగా కన్పిస్తోంది. మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు భిన్న ధోరణి ప్రదర్శిస్తున్నా… అమెరికా మార్కెట్లు మాత్రం చాలా స్పష్టం డౌన్‌ట్రెండ్‌లోకి వెళుతున్నాయి. చైనా కావాలని తమ మార్కెట్లను కూల్చింది. మార్కెట్లలో నెలకొన్న బబుల్‌ను పగులగొట్టింది. దీంతో ఇపుడు అమెరికా మార్కెట్లు కూడా తగ్గడం ప్రారంభమైంది. రాత్రి అమెరికా మార్కెట్లు చాలా స్థిరంగా ప్రారంభమైనా… క్లోజింగ్ కల్లా భారీ నష్టాల్లోకి జారింది. డాలర్ బలపడుతోంది. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో డౌజోన్స్ డౌజోన్స్ 1.6 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా ఒక శాతంపైగా తగ్గింది. ఈ వారంలో భారీగా క్షీణించిన నాస్‌డాక్ రాత్రి మరో 0.44 శాతం కోల్పోయింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా భారీ నష్టాలు కన్పిస్తున్నాయి. చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లకు ఇవాళ సెలవు. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. తైవాన్, కోప్సీది కూడా ఇదే ట్రెండ్. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి అనేక కీలక మద్దతు స్థాయిలను కోల్పోనుంది.