For Money

Business News

భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభం?

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత గురువారం వాల్‌స్ట్రీట్‌తో పాటు అన్ని స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నాస్‌డాక్‌ రెండు శాతంపైగా నష్టపోయింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు 1 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. కరోనా కేసులు పెరగడంతో చైనా మార్కెట్లలో నష్టాలు ఒక శాతం నుంచి 1.5 శాతం వరకు ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం 0.67 శాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి 17,270 ప్రాంతంలో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17475. అంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమౌతుందన్నమాట. ట్రేడింగ్‌ సమయానికి కాస్త కోలుకున్నా… నిఫ్టికి భారీ నష్టాలు ఖాయంగా కన్పిస్తోంది.