స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాస్తవానికి ఒక దశలో ఒక శాతంపైగా నష్టపోయిన నాస్‌డాక్ చివర్లో కోలుకుంది. ఇతర సూచీలు స్వల్ప లాభంతో ముగిశాయి. అంతకుముందు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. కరోనా భయం ఇంకా మార్కెట్లను భయపెడుతోంది. నిక్కీ స్థిరంగా ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ అర శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టాలతో ఉంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.