స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
ఆసియా మార్కెట్ల తీరు చూస్తుంటే నిఫ్టి స్థిరంగా లేదా నష్టాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా… లాభాలు నామ మాత్రమే. అంతకుముందు యూరో మార్కెట్లు కాస్త గట్టి లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 నిన్న 0.78 శాతం లాభంతో ముగిసింది. వరుస లాభాలతో తరవాత ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. జపాన్ మార్కెట్లకు ఇవాళ కూడా సెలవు. చైనా మార్కెట్లు అరశాతం పైన… ఒక శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన హాంగ్‌సెంగ్ ఇవాళ 0.83 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు.