స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
గిఫ్ట్ నిఫ్టి కేవలం 20 పాయింట్ల లాభంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ తగ్గడం మార్కెట్‌కు అనుకూలించే ప్రధాన అంశం. అలాగే చైనా మార్కెట్ల దూకుడు మెటల్ షేర్లకు బాగా కలిసి వస్తోంది. అలాటే వరుసగా అయిదో వారం కూడా నాస్‌డాక్ లాభాలతో ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ కంపెనీల ఫలితాలు ఈవారంలో రానున్నాయి. దీంతో టెక్ షేర్లలో జోరు కన్పిస్తోంది. డాలర్‌లో పెద్ద మార్పు లేకున్నా… పదేళ్ళ అమెరికా బాండ్ల ఈల్డ్స్ 4.3 శాతం చేరడం కాస్త ఆందోళన కల్గిస్తోంది. ఈనేపథ్యంలో నిఫ్టికి 24500 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురు అవుతుందా అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టి, ఎల్లుండి అక్టోబర్ నెల డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున… ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, ఎయిర్‌టెల్, టాటా వవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వెలుగులో ఉండే అవకాశముంది.