స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అనేక మార్కెట్లకు నూతన సంవత్సర సెలవులు కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో మెజారిటీ మార్కెట్ల ఇవాళ పని చేయడం లేదు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, జపాన్ మార్కెట్లకు సెలవు. హాంగ్‌కాంగ్ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజనం ఎవర్‌గ్రాండే ఇవాళ సంచలన ప్రకటన చేసింది. హాంగ్‌సెంగ్ నుంచి తన షేర్ల ట్రేడింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారణం మాత్రం చెప్పలేదు. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి.