లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ సూచీ 0.71 శాతం పెరగ్గా, మిగిలిన సూచీలు కూడా స్వల్పంగా పెరిగాయి. డాలర్ ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. దీంతో బులియన్ దూసుకుపోతోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఒక్క జపాన్ మాత్రమే ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ఇక హాంగ్‌సెంగ్ అరశాతం లాభాల్లో ఉండగా, చైనా మార్కెట్లు ఒకశాతంపైగా లాభపడింది. ఈనేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది. దీంతో మన మార్కెట్లు కూడా నిలకడగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.