For Money

Business News

స్థిరంగా నిఫ్టి ప్రారంభం?

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌లో ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ నష్టాల్లో క్లోజ్‌గా… ఐటీ, టెక్‌ షేర్ల ర్యాలీతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 షేర్ల సూచీ లాభాల్లో ముగిసింది. నాస్‌డాక్‌ ఏకంగా 0.84 శాతం లాభపడింది. ఇవాళ కమలా హారిస్‌, ట్రంప్‌ మధ్య జోరుగా టీవీ డిబేట్‌ జరుగుతుండగా… అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే ధోరణి ఆసియా మార్కెట్లలో కన్పించింది. అయితే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశలు అధికంగా ఉన్నాయి. మరోవైపు క్రూడ్‌ 33 నెలల కనిష్ఠానికి పడిపోవడం..భారత కంపెనీలకు జాక్‌పాట్‌గా భావించవచ్చు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో పాటు హిందుస్థాన్‌ లీవర్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ఇది శుభవార్తే. గత కొన్ని రోజుల నుంచి క్రూడ్‌ వరుసగా తగ్గుతుండటంతో ఏషియన్‌ పెయింట్స్‌తో పాటు ఇతర పెయింట్‌ కంపెనీలు వెలుగులో ఉన్నాయి. జీనియస్‌ పవర్‌ ఇవాళ మళ్ళీ వెలుగులో ఉండే అవకాశముంది. స్మార్ట్‌ మీటర్ల తయారీ కోసం ఈ కంపెనీ రెండు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఇంకా వొడాఫోన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌ ఇండిగో షేర్ల వంటి షేర్లపై ఇవాళ ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేసే అవకాశముంది.

Leave a Reply