భారీ లాభాల్లో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ 1.3 శాతం లాభంతో క్లోజైంది. ఇతర సూచీలు కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. డాలర్ స్థిరంగా ఉండగా, ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా మార్కెట్లలో కన్పించిన ఉత్సాహం… ఆసియా మార్కెట్లలో కన్పించడం లేదు. కేవలం జపాన్ నిక్కీ ఒక్కటే ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు.చైనా, హాంగ్‌సెంగ్ నష్టాల్లో ఉన్నాయి. అయితే నామ మాత్రమే. ఇతర మార్కెట్లలో కూడా పెద్దగా మార్పు లేదు. సింగపూర్ నిఫ్టి మాత్రం 100 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది.