నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. సెలవుల తరవాత ప్రారంభమైన జపాన్ మార్కెట్ ఒక్కటే గ్రీన్లోఉంది. మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ వారం నుంచి అమెరికా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయిన మార్కెట్ వర్గాల అంచనా. దీంతో ఆ మార్కెట్లలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కరోనా వల్ల ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు క్రమంగా కనుమరుగు అవుతాయని వస్తున్న వార్తలు కూడా వర్ధమాన మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. సింగపూర్ నిఫ్ఇ వంద పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి వ్యూహం కోసం నిఫ్టి ట్రేడ్ చదవండి.