స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. నిన్న ఆసియా, యూరో, అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమైనా.. నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్ క్రితం ముగింపు స్థాయి వద్దే ముగిసింది. మెటా ప్లాట్‌ఫామ్ షేర్ రాత్రి 5 శాతంపైగా నష్టపోవడంతో ఎస్ అండ్ పీ 500 సూచీ 0.4 శాతం దాకా నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం నష్టపోయింది. అమెరికా మార్కెట్ బాటలోనే ఆసియా మార్కెట్లు నడుస్తున్నాయి. వారం రోజుల తరవాత తెరచుకున్న చైనా, మార్కెట్లు నిన్న గ్రీన్‌లో ముగిసినా… ఇవాళ నిన్నటి లాభాలు కోల్పోయాయి. హాంగ్‌కాంగ్ కూడా భారీ నష్టాలతో అంటే 1.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న నష్టాలతో ముగిసిన జపాన్ నిక్కీ ఇవాళ 0.5 శాతం లాభంతో ఉంది. అలాగే ఆస్ట్రేలియా కూడా. చైనా, హాంగ్‌సెంగ్ తప్ప మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభాలతో ఉంది. సో…నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.