స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌కు గట్టి జోస్ ఇచ్చిన నాస్డాక్ ఇపుడు కరక్షన్ మోడ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో అన్ని సూచీలు ఒక శాతం నష్టంతో ముగిశాయి. అంతకముందు యూరోపియన్ మార్కెట్లు కూడా. కాని ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు ఒకశాతంపైగా లాభంతో ట్రేడ్ కావడం విశేషం. అలాగే జపాన్ నిక్కీ కూడా 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక హాంగ్‌సెంగ్ కూడా 1.6 శాతం లాభంతో పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లను ఫాలో అయ్యే ఇతర మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం 70 పాయింట్ల నష్టంతో ఉన్న ఎస్‌జీఎక్స్ నిఫ్టి ఇపుడు నష్టాలను బాగా తగ్గించుకుంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.