స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్ స్పందిస్తోంది. సాధారణంగా హాంగ్‌సెంగ్ మార్కెట్‌కు దాదాపుగా మన మార్కెట్ స్పందించేది. ఇపుడు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. అమెరికా మార్కెట్ల విషయానికొస్తే అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్ అరశాతంపైగా లాభంతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ 94 ప్రాంతంలో ఉంటోంది. అలాగే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా నిన్న భారీగా క్షీణించిన హాంగ్‌సెంగ్ ఇవాళ లాభంలో ఉండగా, ఎన్నికల ఫలితాలతో రెండు శాతం పెరిగి నిక్కీ ఇవాళ అరశాతం నష్టంతో ఉంది. ఇక సింగపూర్ నిఫ్టి క్రితం ముగింపు వద్దే ఉంది. ఈ లెక్కన నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు.