లాభాల్లో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా నాస్‌డాక్ 0.9 శాతం లాభంతో ముగిసింది. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.47 శాతం లాభంతో ముగిసింది. టెస్లా భారీ లాభాలే దీనికి కారణం. ఇక డౌజోన్స్ మాత్రం కేవలం 0.18 శాతం లాభంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.88 శాతం లాభంతో ఉంది. చైనాతో పాటు హాంగ్‌కాంగ్ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.33 శాతం నష్టంతో ఉంది. ఇతర చిన్న మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి కూడా స్వల్ప లాభం లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.