డల్‌గా ప్రపంచ స్టాక్ మార్కెట్లు
ప్రపంచ మార్కెట్లకు ద్రవ్యోల్బణ భయం పట్టుకుంది. నిర్ణీత గడువు కంటే ముందుగా వడ్డీ రేట్లను అమెరికా పెంచుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాలతో ముగిశాయి. అయితే నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. వడ్డీ రేట్లపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో… మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. డాలర్ ఇవాళ స్వల్పంగా తగ్గినా.. ఏడాది గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కీలక మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నక్కీ, హాంగ్‌కాంగ్, తైవాన్ మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కోస్పీ ఒక్కటే ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రంగానే ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.