25,000 దిగువకు వెళ్ళేనా?

స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్ నిఫ్టి 112 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైతే… నిఫ్టి సునాయాసంతో 25000 దిగువన ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 25112. చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లలో నష్టాలు పెద్దగా లేకున్నా.. ఇతర ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ముఖ్యంగా డాలర్ ఒక మోస్తరు లాభాలతో ఉన్నా… క్రూడ్ ఆయిల్ మూడు శాతం దాకా పెరిగింది. అయితే ఇవాళ ఐటీ షేర్లలో కూడా ఒత్తిడి వచ్చే అవకాశముంది. చూస్తుంటే ఫైనాన్స్ షేర్లకు… డిఫెన్స్ షేర్లకు ఇవాళ మద్దతు లభించే అవకాశముంది.