ఓపెనింగ్‌లో నిఫ్టికి భారీ లాభాలు?
అంతర్జాతీయ మార్కెట్లు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు జోరు మీద ఉన్నాయి. రాత్రి అమెరికా సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. మూడు సూచీలు పావు శాతంపైగా లాభంతో ముగిశాయి. కాని ఆసియా మార్కెట్లు మాత్రం అరశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ 1.5 శాతం లాభంతో ట్రేడవుతుండగా, జపాన్ నిక్కీ 0.8 శాతం లాభంతో సాగుతున్నాయి. చైనా మార్కెట్లన్నీ ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. మరి నిఫ్టి కూడా ఇదే స్థాయిలో లాభంతో ప్రారంభమౌతుందా అనేది చూడాలి. నిఫ్టి క్రితం ముగింపు 15,692. 15,750పైన ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.