For Money

Business News

డేంజర్‌ జోన్‌లో 23,000

డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా నిన్న నిఫ్టిని కాపాడిన ఆపరేటర్లు ఇవాళ వొదిలేశారు. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 200 పాయింట్లకుపైగా నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీ షేర్లలో ఇవాళ కూడా భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి 23000 స్థాయిని ఇవాళ పరీక్షించే స్థాయి అధికంగా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 200 పాయింట్ల నష్టంతో 23029ని తాకింది. ఇపుడు 23,117 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ 2457 షేర్లు ట్రేడవగా, 1881 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం 524 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే 114 షేర్లు ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌లో ట్రేడవుతున్నాయి. నిన్న 20 శాతం క్షీణించిన పోకర్ణ గ్రానైట్‌ ఇవాళ మరో పది శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది. అలాగే టాటా కన్జూమర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం షేర్లు టాప్‌ 5లో ఉన్నాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఓఎన్‌జీసీ టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ ఉన్నాయి.